: భారత్ విజయలక్ష్యం 281


ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసి, భారత్ ముందు 281 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు డీకాక్ 118 బంతుల్లో 106 పరుగులు (9 ఫోర్లు), ఆమ్లా 117 బంతుల్లో 100 పరుగులు (8 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ఔటైన తర్వాత 26 పరుగులు చేసిన డుమినీ ఒక్కడే రాణించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. డీవిలియర్స్ (3), మిల్లర్ (0), కలిస్ (10) లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మెక్ లారెన్ 12 పరుగులు, ఫిలాండర్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 3 వికెట్లు, అశ్విన్, జడేజాలు చెరొక వికెట్ పడగొట్టారు. డుమిని రనౌట్ గా పెవిలియన్ చేరాడు.

  • Loading...

More Telugu News