: ఇదొక చరిత్రాత్మక విజయం: కేజ్రీవాల్
ఈ ఎన్నికల్లో అవినీతే ప్రధాన అంశమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అన్నారు. అవినీతి, అరాచకాలకు వ్యతిరేకంగా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పారు. ఢిల్లీలోని ఏఏపీ ప్రధాన కార్యాలయంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఇదొక చరిత్రాత్మక విజయమని అన్నారు. అవినీతి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టేందుకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందని చెప్పారు.
దేశ రాజకీయాలు ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీల చుట్టే తిరిగాయని... కానీ సామాన్యులు కూడా ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయవచ్చని ఇప్పుడు ప్రజలు నిరూపించారని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండులను కూడా ప్రజలు మట్టికరిపించారని అన్నారు. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ తెలిపారు. ఈ రాజకీయ పోరాటంలో తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. పెరిగిన ధరలు, అవినీతికి తాము వ్యతిరేకం కాబట్టే ప్రజలు తమకు ఓటు వేశారని అన్నారు.