: ప్రజల అంచనాల మేరకు మా ప్రభుత్వాలు పని చేయలేదు: రాహుల్ గాంధీ


ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజలతో కలసి పని చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయిందని చెప్పారు. ప్రజల అంచనాల మేరకు తమ ప్రభుత్వాలు పనిచేయలేదని అన్నారు. ఢిల్లీలో తన తల్లి సోనియాతో కలసి రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. పార్టీని ఏకతాటిపై నడిపిస్తామని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలతో మమేకమై పని చేసిందని... దాంతో ఆ పార్టీ తొలి ప్రయత్నంలోనే మెరుగైన ఫలితాలను రాబట్టుకోగలిగిందని అభిప్రాయపడ్డారు. కొద్ది రోజుల్లోనే తిరిగి పుంజుకోగల సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని రాహుల్ తెలిపారు. ప్రజల అభిప్రాయాలను తెలుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటిదాకా రాజకీయాలను సంప్రదాయబద్ధంగానే చూశామని... ఇకపై ప్రజా కోణంలో చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News