: అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం ప్రభావం అధికంగా ఉంటుంది: సోనియాగాంధీ
అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం ప్రభావం అధికంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు జాతీయ స్థాయి సమస్యలపై ఆలోచిస్తారని చెప్పారు. ఢిల్లీలో సోనియా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వివిద రాష్ట్రాల్లో ఓటమికి గల కారణాలను సమీక్షిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ లోతైన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సరైన సమయంలో ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. సోనియాతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.