: అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ దృష్టి
ఎమ్మెల్సీ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ నెల 13 నుండి ప్రారంభం కానున్నశాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ సహా లేవనెత్తాల్సిన ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. మరోవైపు సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేస్తున్న నేపథ్యంలో దానిపైనా దృష్టి సారించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చిస్తున్నారని తెలుస్తోంది.