: అర్ధ సెంచరీలు పూర్తిచేసుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్లు
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య డర్బన్ లో జరుగుతున్న రెండో వన్డేలో సఫారీ ఓపెనర్లు చెలరేగుతున్నారు. వీరు 23 ఓవర్లలో 136 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం, హషీమ్ ఆమ్లా 55 పరుగులతో, డీకాక్ 79 పరుగులతో క్రీజులో ఉన్నారు. కెప్టెన్ ధోనీ ఇప్పటి వరకు ఆరు మంది బౌలర్లతో బౌలింగ్ చేయించినా... ఏ ఒక్కరు కూడా సఫారీ బ్యాట్స్ మెన్ పై ప్రభావం చూపలేకపోయారు.