: షీలాను మట్టికరిపించిన కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కు తన పవరేంటో చూపించారు. ఏ మాత్రం రాజకీయానుభవం లేని వ్యక్తి ఏడాది కిందట పార్టీ పెట్టి.. తొలిసారి ఎన్నికల్లో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న రాజకీయ దిగ్గజం షీలాను ఓడించడం ఆషామాషీ కాదు. అంచనాలకు అందని విధంగా కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి షీలాపై 22వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పెరిగిన విద్యుత్ ధరలు, మహిళలకు భద్రతలేమి దేశ రాజధాని ప్రజల్లో షీలాపై ఆగ్రహానికి కారణమైంది. దీంతో షీలాకు కర్రుకాచి వాతపెట్టారు. ఓటమితో షీలాను అధికారానికి దూరంగా పెట్టారు.