: కూడంకళం విద్యుత్ కేంద్రం ముట్టడికి ఆందోళనకారుల యత్నం
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కూడంకళం అణు విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించేందుకు ఈ ఉదయం ఆందోళనకారులు యత్నించారు. దీంతో అణు విద్యుత్ కేంద్రం వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి.
ఆందోళనకారుల వల్ల విద్యుత్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంటుందని ఊహించి, ఆదివారమే 7 కిలోమీటర్ల పరిధి వరకు నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో నిన్నటి నుంచే విద్యుత్ కేంద్రం వద్ద గట్టి పోలీసులు భద్రతను ఉంచారు.