: కాంగ్రెస్ అధిష్ఠానానికి నచ్చిందే రంభ: జేసీ
కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని హైకమాండ్ విభజించిన తీరును ఆయన తప్పుబట్టారు. అధిష్ఠానం తీరు తనకు నచ్చిందే రంభ అనే విధంగా ఉందని విమర్శించారు. విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాజధాని వల్ల ప్రయోజనం లేదని, కొత్త రాజధానిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ విభజనకు వ్యతిరేకంగా ఎంతగానో ప్రయత్నిస్తున్నారని... కానీ విభజన ఆగే పరిస్థితి లేదని అన్నారు.