: రాజస్థాన్ లో కొత్త మంత్రుల కోసం 42 కొత్త లగ్జరీ కార్లు సిద్ధం
ఒక వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే, మరో వైపు కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే వారి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల కోసం ఇప్పటికే 42 కొత్త టాటా సఫారీ కార్లను సిద్ధం చేశామని రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలకోసం తాత్కాలిక నివాస ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు వెల్లడించారు.