: కర్ణాటకలో వోల్వోల వాయు వేగం.. 282 బస్సుల సీజ్
స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమై 45 మందికిపైగా సజీవ దహనం అవగా.. కర్ణాటకలో మరో వోల్వో దగ్ధం కావడంతో 5 మందికిపైగా ఆహుతయ్యారు. దీంతో మన రాష్ట్రంలో వలే కర్ణాటక రవాణా శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. వోల్వోలు వేగ పరిమితి దాటుతున్నాయని, గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్నాయని ఆ రాష్ట్ర రవాణా మంత్రి రామలింగారెడ్డి విధానసభకు తెలిపారు. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 3 వరకు మొత్తం 17,820 వాహనాలను తనిఖీ చేసి 5,810 కేసులు నమోదు చేశామన్నారు. కొందరి నుంచి జరిమానా వసూలు చేశామని, 282 బస్సులను సీజ్ చేశామని చెప్పారు. వేగ నిరోధకాలను అమల్లోకి తెచ్చామని, అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలని బస్సు ఆపరేటర్లను ఆదేశించామని చెప్పారు.