: శృంగారానికి ఆస్తమా పెద్ద శత్రువే!


ఆస్తమా (ఉబ్బసం) వ్యాధి పీడితులు జీవితంలో ఆనంద మధురిమలను ఆస్వాదించడానికి అదొక అవరోధమని ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. శృంగారానికి ఆస్తమా పెద్ద శత్రువేనట. తమ శృంగార జీవితానికి ఆస్తమా అవరోధంగా ఉందని 33 శాతం మంది పురుషులు, 20 శాతం మంది మహిళలు తెలిపారు. సామాజిక సంబంధాలపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. 33 శాతం పురుషులు ఈ వ్యాధి కారణంగా తమ సంతానాన్ని ఆత్మీయంగా దగ్గరకు తీసుకోలేని పరిస్థితి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వెయ్యి మందికిపైగా ఆస్తమా రోగుల జీవనశైలిని అధ్యయనం చేయగా ఈ విషయాలు తెలిశాయి.

  • Loading...

More Telugu News