: ఓటమిని అంగీకరించిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కమలం దెబ్బకు హస్తం చిత్తయిపోయింది. ఈ నేపథ్యంలో, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఓటమిని అంగీకరించారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సరిగ్గా తీసుకొని వెళ్లలేకపోయామని వాపోయారు. బీజేపీ మాత్రం శుష్క వాగ్దానాలతో ఓటర్లను మభ్యపెట్టిందని విమర్శించారు. దీనికితోడు, ఎన్నికల సర్వేలు కూడా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచాయని అన్నారు.