: ఆరోద్దు బాబోయ్.. ఐదే ముద్దు


ఉదయం లేస్తే ఉరుకులు పరుగులు.. ఆఫీసు. ఎప్పుడూ ఇంతేనా.. వద్దు వారానికి ఆరు రోజుల పని కూడా మాకొద్దు. వారానికి ఐదు రోజులు పనిచేసే ఉద్యోగమే మాకు ముద్దు అని భావించే వాళ్లు పెరిగిపోతున్నారు. ఎగ్జిక్యూటివ్స్ రీసెర్చ్ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. వారానికి ఐదు రోజుల ఉద్యోగమే కావాలని కోరుకునే వారి శాతం 50శాతం ఉందని తెలిపింది. ఐదేళ్ల క్రితం ఇది 20శాతమేనట.

అంటే ఆఫీసే కాకుండా తమ వ్యక్తిగత జీవితం, కుటుంబానికి కూడా ఎక్కువ సమయం వెచ్చించాలని కోరుకునేవారి సంఖ్య పెరిగిపోతుందని దీన్నిబట్టి తెలుస్తోంది. గతంలో ఆరు రోజుల పనంటే ఆ ఉద్యోగం మాకొద్దని నిర్మొహమాటంగా వదులుకునేవారు 15 శాతం ఉంటే ఇప్పుడు 40 శాతానికి పెరిగిపోయారు. ముఖ్యంగా మధ్యస్థాయి, సీనియర్ స్థాయిలోని మహిళా ఉద్యోగులు ఎక్కువ శాతం ఐదు రోజుల ఉద్యోగాన్నే ఇష్టపడుతున్నారని తేలింది.

  • Loading...

More Telugu News