: జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడి


జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముగ్గురు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. వీరిలో ఒక మూగ, చెవిటి బాలిక కూడా ఉండడం దారుణం. దోడా జిల్లాలో షాజహాన్ అనే యువకుడు పొరుగింట్లో ఎవరూ లేని సమయం చూసి వికలాంగ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. షాజహాన్ ను అరెస్ట్ చేశారు. ఇదే జిల్లాలో ఇంటర్ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడే ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె నాలుగు నెలల గర్భిణిగా తేలింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో ఘటనలో జమ్మూలోని అఖ్ నూర్ లో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ రింకు కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News