: విభజనకు వ్యతిరేకంగా రెండో రోజు విశాఖ బంద్


ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలంటూ విశాఖ వాసులు చేసిన రెండో రోజూ బంద్ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో విశాఖ వీధులు మార్మోగాయి. విభజన వద్దంటూ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పలు రాజకీయ పార్టీలు ధర్నాలు చేసి బంద్ కు మద్దతు ప్రకటించాయి. నిత్యం జనాలతో రద్దీగా ఉండే షాపింగ్ కాంప్లెక్స్, బస్టాండ్ పరిసరాలు వెలవెలబోయాయి. బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. పెట్రోలు బంకులు సైతం మూతపడ్డాయి. కేజీహెచ్ లో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. అయితే కేజీహెచ్ అత్యవసర వైద్య విభాగం మాత్రం పనిచేసింది.

  • Loading...

More Telugu News