: విభజనను అడ్డుకునే వ్యూహంలో పయ్యావులతో మంత్రి శైలజానాథ్ భేటీ
విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంపై చర్చించడానికి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తో రాష్ట్ర మంత్రి శైలజానాథ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో నిన్న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అన్ని పార్టీల సీమాంధ్ర నేతలతో కలిసి మాట్లాతున్నామని శైలజానాథ్ చెప్పారు. అందులో భాగంగానే కేశవ్ తో భేటీ అయినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలతో కూడా ఫోన్ లో మాట్లాడుతున్నామన్నారు. త్వరలో స్వయంగా వారిని కలిసి చర్చిస్తామన్నారు. తెలంగాణ బిల్లును మెజార్టీ సభ్యులు అడ్డుకుంటారన్న నమ్మకం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.