: విజయవాడ సభలో సమైక్యాంధ్రను సమర్థించిన సీఎం కిరణ్


విజయవాడ స్వరాజ్ మైదానంలో పులిచింతల ప్రారంభోత్సవ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభలో సీఎం కిరణ్ పాల్గొని ప్రసంగించారు. పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం ఆయన నేరుగా విజయవాడకు వచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టుల గురించి సీఎం కిరణ్ మాట్లాడారు.

జూన్ మొదటి వారంలో పొలాలకు నీళ్లు ఇవ్వగలిగితే అక్టోబరులో పంట చేతికొస్తుందని కిరణ్ చెప్పారు. వచ్చే సీజన్ లో జూన్ మొదటి వారంలో సాగునీరు విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. చేతికొచ్చిన పంట తుపానులు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. వైపరీత్యాల నష్టాన్ని తగ్గించాలన్నా, వరదలు నివారించాలన్నా నీటి పారుదల ప్రాజెక్టులు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే పంటలు బాగా పండుతాయన్నారు. మన రాష్ట్రానికి ప్రస్తుతం 811 టీఎంసీల నికర జలాలున్నాయని ఆయన వెల్లడించారు. కృష్ణా డెల్టా 1855 నాటిదని, ఇప్పుడు కృష్ణా డెల్టా పై 45 ప్రాజెక్టులున్నాయన్నారు. పులిచింతల, దుమ్ముగూడెం, పోలవరం పూర్తయితే మరో 75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. విభజన జరిగితే నీటి పంపిణీ కష్టమవుతుందని, రాష్ట్రం ఎడారిగా మారుతుందని, అందుకే విభజన నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

  • Loading...

More Telugu News