: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా కర్నాటక బుల్డోజర్స్


అప్పటివరకు మంచి ఊపుతో దూసుకువచ్చిన తెలుగు వారియర్స్ జట్టు ఫైనల్స్ లో మాత్రం చతికిలబడింది. సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) టోర్నీలో కన్నడ తారలతో కూడిన కర్నాటక బుల్డోజర్స్ జట్టు విజేతగా నిలిచి, కప్పు తన్నుకుపోయింది. నిన్న రాత్రి బెంగళూరు స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో తెలుగు వారియర్స్ పరాజయాన్ని చవిచూసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన బుల్డోజర్స్ జట్టు పరిమిత 20 ఓవర్లలో 148 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగుకి దిగిన తెలుగు వారియర్స్ ఏడు వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ చేజారిపోయింది. 26 పరుగుల తేడాతో బుల్డోజర్స్ జట్టు విజేతగా నిలిచి కప్పు సంపాదించుకుంది.    

  • Loading...

More Telugu News