: రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి... పలు ప్రాంతాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో అతి తక్కువ ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హకీంపేట, మెదక్, రామగుండంలో 11 డిగ్రీలు, నిజామాబాద్ లో 12 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.