: రాయల ముఖ్యమంత్రుల వల్లే తెలంగాణకు అన్యాయం: మధుయాష్కీ
చరిత్రలో రాయలసీమ ముఖ్యమంత్రుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. అందుకే రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం వద్ద తీవ్రంగా వ్యతిరేకించానన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు పొడిగించి అయినా బిల్లును ఆమోదింపచేయాటానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. సీమాంధ్ర ఎంపీలు మద్దతు ఉపసంహరణ లేఖలిచ్చినా, ముఖ్యమంత్రి రాజీనామా చేసినా తెలంగాణ విభజన ఆగదని ఆయన తేల్చి చెప్పారు. పది జిల్లాల తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తామన్న టీఆర్ఎస్ మాట మీద నిలబడాలని గర్తు చేశారు. అవినీతి ఊబిలో ఉన్న జగన్ తో అవగాహన ఒప్పందం చేసుకునే అవసరం కాంగ్రెస్ కు లేదని యధుయాష్కీ స్పష్టం చేశారు.