: హైదరాబాదులోని ఉప్పల్ లో భారీగా స్థంభించిన ట్రాఫిక్


హైదరాబాదులోని ఉప్పల్ లో ఉదయం నుంచి ఇప్పటివరకు ట్రాఫిక్ భారీగా స్థంభించింది. దాంతో, ఎక్కడి వాహనాలు అక్కడ కదలకుండా ఉన్నాయి. మెట్రో రైల్వేకు జరుగుతున్న పనుల వల్లే ఈ సమస్య ఏర్పడిందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఉప్పల్ నుంచి హబ్సిగూడ, నాగోల్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News