: 'రామ్ లీల' చిత్ర దర్శకుడు, హీరో లపై కేసు


ఉత్తరప్రదేశ్ లో విడుదలకు సిద్ధమైన 'గలియోన్ కి రాసలీల రామ్ లీల'పై కొన్నిరోజుల కిందట అక్కడి స్థానిక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కోర్టు ఆదేశాలతో చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, హీరో రణ్ వీర్ సింగ్, హీరోయిన్ దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా సహా 12 మందిపై భమౌరా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రామ్ లీల చిత్రం హింస, అశ్లీలంతో ప్రజలను ప్రభావితం చేసేలా ఉందంటూ నవంబర్ 18న కైలాష్ చంద్ర అనే వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు.

  • Loading...

More Telugu News