: కొరియా చేతిలోనూ ఓడిన భారత్ హాకీ జట్టు
అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది. నిన్న ఆస్ట్రేలియా చేతిలో చిత్తయిన భారత్ నేడు దక్షిణ కొరియాతో మ్యాచ్ లోనూ చేతులెత్తేసింది. ఆదివారం మలేసియాలో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ లో భారత్ 1-2తో దక్షిణ కొరియాపై ఓటమిపాలైంది. ఈ పరాజయంతో భారత్ సెమీస్ చాన్సులు ప్రమాదంలో పడ్డాయి.