: రేపు వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు


మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్, మిజోరం, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ మేరకు రేపు ఈ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేసింది. ఒక్క మిజోరం తప్ప మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోనుందని, ఆ రాష్ట్రాల్లో బీజేపీ వికసించనుందని రెండు రోజుల కిందటే సర్వేలు బల్లగుద్ది చెప్పాయి. అటు ఢిల్లీలో హంగ్ ఏర్పడుతుందని సర్వేలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభ్యర్ధులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. మరి అసలు విజయం ఎవరిని వరిస్తుంది? ఎవరు ఓడిపోనున్నారు? తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

  • Loading...

More Telugu News