: కిల్లి కృపారాణి ఇంటి ముట్టడికి టీడీపీ సమైక్యవాదుల యత్నం


సీమాంధ్ర కేంద్ర మంత్రులకు విభజన సెగ తగులుతోంది.ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించేందుకు టీడపీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు విఫలయత్నం చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ముట్టడిని అడ్డుకున్నారు. దాంతో, పోలీసులు, సమైక్యవాదుల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో పలువురు గాయపడ్డారు. వెంటనే ఆందోళనలో పాల్గొన్న టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జి రామ్మోహన్ నాయుడు, టెక్కలి మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సహా పలువురు సమైక్యవాదులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

  • Loading...

More Telugu News