: పెళ్లి ఒక్కటే ఆప్షన్ కాదు: ఉదయ్ చోప్రా
పెళ్లి చేసుకోవాలంటూ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని 41 ఏళ్ల నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా తెలిపారు. అయినా, ఈ రోజుల్లో పెళ్లి ఒక్కటే ఆప్షన్ కాదన్నారు. లాస్ ఏంజెలెస్ లో స్థిరపడిన ఉదయ్ చోప్రా ప్రస్తుతం ధూమ్ 3 చిత్ర ప్రమోషన్ కోసం ముంబై వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నచ్చిన అమ్మాయి కనిపించినా.. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే మనం కూడా చేసుకోలేము కదా? అన్నారు. కనుక వివాహం చేసుకోవాలన్న నియమం లేదని.. ఈ రోజుల్లో అదొక్కటే ఆప్షన్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.