: కోచ్ ఎవరైనా ఒకటేనంటున్న పాక్ ట్వంటీ20 కెప్టెన్
కోచ్ స్వదేశీ అయినా, విదేశీ అయినా ఎలాంటి మార్పు ఉండదని పాక్ ట్వంటీ20 జట్టు కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ సయీద్ అన్నారు. త్వరలో వెళ్ళిపోతున్న ఆస్ట్రేలియా కోచ్ డేవ్ వాట్ మోర్ చాలా విలువైన సేవలు అందించారని ప్రశంసించారు. ఇక ఆటగాళ్లే తమ సత్తా చూపాలన్నారు. పాక్ క్రికెట్ మేనేజర్ మోయిన్ ఖాన్ ఇప్పటికే విదేశీ కోచ్ కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే.