: పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి
గుంటూరు జిల్లాలో చేపట్టిన పులిచింతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేసారు. రూ.1,831 కోట్ల వ్యయంతో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. కృష్ణా డెల్టాను స్థిరీకరించి 13 లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సుదర్శన్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, కాసు, డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొన్నారు.