: 'పంజాబ్ ఎక్స్ ప్రెస్' ఎక్కనున్న షారూక్
చెన్నై ఎక్స్ ప్రెస్ తో విజయం సాధించిన షారూక్ మరోసారి రోహిత్ శెట్టితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చెన్నై ఎక్స్ ప్రెస్ కు సీక్వెల్ తీయడానికి రోహిత్ రెడీ అవుతున్నారట. పంజాబ్ ఎక్స్ ప్రెస్ పేరుతో వచ్చే ఏడాది ఈ సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కథానాయికగా మళ్లీ దీపికకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి.