: ఇదేమన్నా నవలా.. అరగంటలో చదవడానికి: కావూరి
9 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశాన్ని చులకనగా తీసుకోకుండా విభజనపై చర్చించాలని సూచించామని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. పది నిమిషాల్లో చదివి చెప్పడానికి ఇదేమన్న నవలా? అని కావూరి ప్రశ్నించారు. కధ అయితే గంటో అరగంటలో చెబుతామని, కానీ విభజన అంశంపై మంత్రులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని.. అందుకే తగిన సమయం కావాలని కోరితే దానిపై వారు సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. ముసాయిదా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు తమ వాదనలు వినిపిస్తామని ఆయన తెలిపారు. అయితే రాష్ట్ర విభజన అంశం కేబినెట్ భేటీలో టేబుల్ అయిటెంగా పెట్టడం సరికాదని కావూరి అభిప్రాయపడ్డారు. దానికి సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎలా ఒప్పుకున్నారని అడిగిన మీడియాతో.. అది సరికాదని తాను చెబుతున్నానని, అయితే ఏం చేయమంటారని మీడియాను ఎదురు ప్రశ్నించారు.