: దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటీ...!
అమ్మ, నాన్నా లేక.. ఉన్నా ఆదరణ లేక.. అమ్మలేక నాన్న చేతిలో దండనకు గురైన చిన్నారులకు.. పిల్లలకు పోషణ భారమైన తల్లిదండ్రులకు వీధులు, ప్లాట్ ఫామ్ లు, ఫ్లై ఓవర్లు పెద్ద దిక్కుగా మారుతున్నాయి. గూడులేని వారికి వీధులే ఆశ్రయమిస్తున్నాయి. దేశంలో ప్రతీ 1000 మందిలో ఇద్దరి పరిస్థితి ఇదేనని గూడులేని జనాభాపై నిన్న విడుదలైన వివరాలు తెలియజేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే వీరి సంఖ్య భారీగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో 18.56శాతం, మహారాష్ట్రలో 11.9 శాతం, రాజస్థాన్ లో 10.24శాతం, మధ్య ప్రదేశ్ లో 8.26 శాతం, తమిళనాడులో 2.87శాతం మందికి నిలువ నీడలేదు.