: ఇవాళ్టితో ముగియనున్న పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు


చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తొమ్మిదో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకొన్నాయి. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. చక్రస్నానం రోజున అమ్మవారికి తిరుమల నుంచి సారెను తీసుకురావడం ఆనవాయతీగా వస్తోంది. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల మధ్య పసుపు, కుంకుమ, పూల రాశులతో సారెను తిరుపతి వీధుల నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. సారె ఉత్సవానికి గజరాజులు వెంట రాగా.. భారీగా భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News