: శంషాబాద్ విమానాశ్రయంలో తొమ్మిది లక్షల విలువైన బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి రూ.9 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాదుకు వస్తున్న టైగర్ ఎయిర్ వేస్ లో బంగారం తరలిస్తున్నట్లు సమాచారం అందిందని, ఈ మేరకు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.