: జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్ కు గృహ నిర్బంధం


జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ యాసిన్ మాలిక్ కు గృహ నిర్బంధం విధించారు. పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ వస్తుండగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు ఆయన్నుఅదుపులోకి తీసుకున్నారు. అనంతరం యాసిన్ మాలిక్ ను మైసుమాలోని ఆయన నివాసానికి తరలించారు.

26/11 దాడి కేసు నిందితుడు హఫీజ్ సయీద్ పాకిస్తాన్ లో ఇచ్చిన విందుకు మాలిక్ కుటుంబ సమేతంగా హాజరుకావడంపై భారత ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కాగా, పార్లమెంటు దాడి కేసు నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీసిన తర్వాత యాసిన్ మాలిక్ భారత్ రావడం ఇదే ప్రథమం. 

  • Loading...

More Telugu News