: సంజయ్ దత్ కు నెల రోజుల పెరోల్ మంజూరు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు నెల రోజుల పెరోల్ మంజూరైంది. ఈ మేరకు ఆయన కొన్ని రోజుల్లో జైలు నుంచి విడుదలవనున్నారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో సంజయ్ రెండు నెలల నుంచి పుణేలోని ఎరవాడ జైల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పెరోల్ కోసం ఆయన పుణే డివిజినల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్ ముఖ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అనుమతి లభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఇంకా విడుదల తేదీ నిర్ణయించలేదని, మిగతా లాంచనాలు పూర్తయిన అనంతరం తేదీని ఖరారు చేస్తామన్నారు. ఒకవేళ లాంచనాల వర్క్ అంతా ఈ రోజే పూర్తయితే సంజూ రేపే విడుదల కావచ్చని తెలుస్తోంది. అనారోగ్య పరిస్థితుల కారణంగా సంజయ్ కు అక్టోబర్ లో ఇలాగే ఇరవై రోజుల పాటు పెరోల్ ఇచ్చారు.