: సౌదీ అరేబియా కాదనుకుంది.. జోర్డాన్ వచ్చి చేరింది
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జోర్డాన్ తాత్కాలిక సభ్యత్వం దక్కించుకుంది. సౌదీ అరేబియా ఎన్నికైనా.. సిరియా, ఇజ్రాయెల్-పాలస్థీనా ఘర్షణలకు ముగింపు పలకడంలో భద్రతామండలి విఫలమైనందుకు నిరసనగా.. సభ్యత్వం వదులుకుంది. దీంతో నిన్న జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో అరబ్ దేశాలు సౌదీ స్థానంలో జోర్డాన్ ను ఎన్నుకున్నాయి.