: ఏటీఎం సేవలు ఇక కాస్ట్ లీ గురూ!
బెంగళూరులో ఒక ఏటీఎంలో మహిళపై దాడి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తున్నాయి. కచ్చితంగా సెక్యూరిటీ గార్డు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.
ఏటీఎం వద్ద గార్డు, సీసీటీవీ ఏర్పాటుకు అదనంగా 50వేల రూపాయల వరకు ఖర్చవుతుందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఈ ఖర్చును వినియోగదారుల నుంచే రాబట్టాలని నిర్ణయిస్తున్నాయి. అదే సమయంలో సొంత కస్టమర్లకు కూడా ఒక్కో ఏటీఎం లావాదేవీపై 5 రూపాయల చార్జీ విధించాలనే ప్రతిపాదనను బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. ఇవి అమల్లోకి వస్తే మళ్లీ బ్యాంకుల్లో క్యూలు పెరుగుతాయేమో!