: ఒక్క ఛాన్స్ ఇస్తానని ఆశ చూపి.. గర్భవతిని చేశాడు


సినిమా ప్రపంచం రంగుల లోకం.. ఎన్నో ఆశలతో యువతరం కలలు కనే రంగం.. అవకాశాల కోసం ఎంతో మంది యువత హీరోలు, హీరోయిన్లు అయిపోదామని హైదరాబాద్ కు వస్తుంటారు. ఒక్క ఛాన్స్ కోసం ఏం చేసేందుకైనా సిద్ధపడుతుంటారు.. ఆ ఒక్క ఛాన్సే ఓ యువతి కొంప ముంచింది. సినిమాల్లో హీరోయిన్ ను చేస్తానని దొంగ మాటలు చెప్పి ఓ యువతిని గర్భవతిని చేశాడో దుర్మార్గుడు.

ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన శ్రీజను 'లవ్ ఈజ్ గేమ్' అనే సినిమాలో హీరోయిన్ ను చేస్తానంటూ 'లవ్ సిలబస్' అనే సినిమాకి దర్శకత్వం వహించిన చాంద్ పాషా గర్భవతిని చేశాడు. సినిమా అవకాశం ఆశ చూపి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తనను మోసం చేశాడని శ్రీజ నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా చాంద్ పాషాకు ఇంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News