: మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కన్నుమూత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రకాశం జిల్లా మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య(49) అనారోగ్యంతో ఈ ఉదయం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. 1997 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మార్టూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో మార్టూరు, పర్చూరు స్థానాల్లో పోటీ చేసినా గెలుపొందలేదు. ఏడాది క్రితమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.