: విశాఖలో మిన్నంటిన ఆందోళనలు
రెండు రోజుల సీమాంధ్ర బంద్ సందర్భంగా విశాఖజిల్లాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పలు రంగాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరిస్తుండడంతో విద్యా, వ్యాపార సంస్థలు రెండో రోజు కూడా మూతపడ్డాయి. అత్యవసర సేవలు మినహా కేజీహెచ్ లోని వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆంధ్రా యూనివర్సిటీ నిన్న, ఈ రోజు నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది.