: రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. సీఎం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు: కిషన్ రెడ్డి
రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ కు చీమకుట్టినట్టయినా లేదని, ఎంచక్కా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ సంక్షోభం తీవ్రరూపం దాల్చినా ప్రభుత్వం స్పందించడం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. సరిగ్గా బడ్జెట్ సమావేశాలకు ముందు కరవు మండలాలు ప్రకటించడంలో సర్కారు అంతర్యమేంటో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.