: ముగిసిన సీఎం భేటీ..అఖిలపార్టీ జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం: శైలజానాథ్


రాష్ట్ర సమైక్యత కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్టు మంత్రి శైలజానాధ్ తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో వున్న సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన బిల్లుపై తమ అసమ్మతి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించారన్నారు.

ఇతర పార్టీల నేతలను సమన్వయం చేసి మద్దతు కూడగట్టే బాధ్యతను సీఎం మంత్రులకు అప్పగించారు. బిల్లు పార్లమెంటుకు రాగానే న్యాయపోరాటం ప్రారంభించాలని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి బిల్లు ఎన్ని రోజుల్లో వస్తుందో చూసిన తరువాత కార్యాచరణ నిర్ణయించనున్నామని ఆయన తెలిపారు. జేఏసీ బాధ్యతను సీఎం సీనియర్లకు అప్పగించారు. ఈ నెల 11న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో భేటీ కావాలని వారు నిర్ణయించాని శైలజానాథ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News