: కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉండదు.. ఇతర పార్టీలూ వస్తాయి: చంద్రబాబు
రాష్ట్ర విభజనపై యూపీఏ ప్రభుత్వం అవలంభించిన విధానాన్నే తరువాత అధికారంలోకి వచ్చే పార్టీలు అవలంభిస్తే కాంగ్రెస్ భవిష్యత్ ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎల్ల కాలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండదని, ఇతర పార్టీలు కూడా అధికారాన్ని చేపడతాయని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే అప్పడు ఏం జరుగుతుందని, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ను దేశంలో లేకుండా తరిమికొట్టే పరిస్థితి వచ్చిందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.