: నేను పోరాడతాను.. ఇక చూస్కోండి..చంద్రబాబు సవాలు


విద్యార్థులను నిరుద్యోగులను చేసే విధంగా రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానని చంద్రబాబు నాయుడు సవాలు విసిరారు. పార్టీమీద ఉన్న కక్షను ప్రజల మీద తీర్చుకున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న చంద్రబాబు.. తెలుగు జాతికి, తెలుగు యువతకు, తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామని ఎలా అనుకున్నారని, అది తెలంగాణ అయినా.. లేదా సీమాంధ్ర ప్రాంతాలైనా ఎవరికి అన్యాయం జరిగినా తాను ఊరుకునే స్థితిలో లేనని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయమైపోయిన వారి తరపున తాను పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News