: కూకట్ పల్లిలో బోర్డు తిప్పేసిన ప్రతిభ కంపెనీ
హైదరాబాద్ నగరంలో మరో కంపెనీ మోసం వెలుగు చూసింది. కూకట్ పల్లిలో ప్రతిభ రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. తమ సంస్థలో నివాస స్థలాలు కొంటే బంగారం బహుమతిగా ఇస్తామని నమ్మబలికి, నగర వాసుల నుంచి సుమారు వంద కోట్ల రూపాయలు వసూలు చేశారని తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో ప్రతిభ కంపెనీ నిర్వాకం బయటపడింది.