: మహాతల్లి సోనియా ప్రజల మధ్య చిచ్చుపెడుతోంది: చంద్రబాబు


వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ లతో ఇరుప్రాంతాల్లో ఒప్పందాలను కుదుర్చుకుని కాంగ్రెస్ అధిష్ఠానం నాటకాలాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ సోదరభావంతో మెలగేవారని... కానీ మహాతల్లి సోనియా చిచ్చుపెడుతోందని అన్నారు. సోదరుల్లాంటి ప్రజలకు అన్యాయం జరుగుతోందని... తెలంగాణ వారు కూడా ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఏడెనిమిది ఏళ్లుగా అంతులేని అవినీతిని ప్రోత్సహిస్తూ వ్యవస్థనంతటినీ సోనియా నాశనం చేశారని అన్నారు. విభజనపై చర్చించడానికి ఢిల్లీలో అఖిలపక్షం పెట్టమని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News