: నిర్ణయమేంటో కూడా జీవోఎం స్పష్టంగా చెప్పలేకపోయింది: చంద్రబాబు


రాష్ట్ర విభజనపై కమిటీలు వేస్తూనే పోయారుకానీ, వాటిలో ఏముందో ఏనాడూ బయటపెట్టలేదంటూ కాంగ్రెస్ అధిష్ఠానంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. కొత్త రాజధానిపై మళ్లీ కమిటీ అంటున్నారు... ఇప్పటిదాకా ఏం చేశారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటున్నారు... కానీ, దాన్ని ఎలా పూర్తి చేస్తారో చెప్పడం లేదన్నారు. కొత్త రాజధానికి మంచి ప్యాకేజీ అంటున్నారు... కానీ ఏం ఇస్తారో చెప్పలేదని తెలిపారు. కాంగ్రెస్ పెద్దలు చిచ్చు పెడతారని, విద్వేషాలను రెచ్చగొడతారని మండిపడ్డారు. అసలు తమ విధానమేంటో, నిర్ణయమేంటో కూడా జీవోఎం స్పష్టంగా చెప్పలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. విభజన సంప్రదాయ బద్ధంగా జరగలేదని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News