: 'డెట్టాల్ లిక్విడ్'పై వినియోగదారుని విజయం


బ్రాండెడ్ ఉత్పత్తుల్లో ప్రస్తుత కాలంలో తప్పిదాలు సాధారణమైనట్లు కనిపిస్తోంది. దీంతో అప్పటివరకూ మార్కెట్ లో వారి ఉత్పత్తికి ఉన్నపేరును పోగొట్టుకుంటున్నాయి. 'డెట్టాల్ లిక్విడ్' ఇందుకు మినహాయింపుకాదు. తాజాగా ఓ వినియోగదారుడు కొన్న డెట్టాల్ సీసాలో చనిపోయిన కొన్ని కీటకాలు కనిపించాయి.

ఆ విషయాన్ని గమనించిన అతను.. పురుగులున్నసీసాను తనకు దుకాణదారు అమ్మారంటూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. పరిశీలించిన ఢిల్లీ వినియోగదారుల ఫోరం.. డెట్టాల్ తయారుదారు రెకిట్ బెంకిసర్ కంపెనీకి, ఆ ఉత్పత్తిని అమ్మిన దుకాణదారుకు కలిపి  రూ.10వేల  జరిమానా వేసింది. ఆ మొత్తాన్ని వినియోగదారుడికి చెల్లించాలని ఫోరం ఆదేశించింది.   

  • Loading...

More Telugu News