: కేంద్ర మంత్రులు పూర్తిగా చదవకుండానే తీర్మానం చేసేశారు: చంద్రబాబు
రాష్ట్ర విభజన అంశాన్ని టేబుల్ ఐటెంగా తీసుకురావడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కేబినెట్ మీటింగ్ లో అప్పటికప్పుడు నోట్ ఇస్తే... ఎంత మంది మంత్రులు దాన్ని చదివి అర్థం చేసుకోగలరని ప్రశ్నించారు. మంత్రులు పూర్తిగా చదవకుండానే తీర్మానం చేసేశారని దుయ్యబట్టారు. టేబుల్ ఐటెంగా తీసుకొచ్చే అంశమా ఇది? అని నిలదీశారు. కొంత సమయం కావాలని కేంద్ర మంత్రులు కోరినా చిదంబరం తిరస్కరించారని చెప్పారు. తన నివాసం నుంచి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.